తెలంగాణ లోని పంచాయతీరాజ్ పాఠశాలల్లో స్వీపర్లుగా పని చేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనం టైమ్ స్కేల్ ప్రకారం చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
తమకు కనీస వేతనాలు చెల్లించాలని కోరుతూ వివిధ జిల్లాలకు చెందిన 40 మంది స్వీపర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు ను విచారించిన జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి స్వీపర్లకు నెలకు రూ.13వేలు వేతనం చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు.