హైదరాబాద్ (నవంబర్ 15) : రష్యా ప్రభుత్వం తరపున తమ దేశంలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్కాలర్షిప్ లు అందిస్తామని చెన్నైలోని రష్యా హౌస్ బుధవారం వెల్లడించింది. రష్యాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారత విద్యార్థులు ఆయా యూనివర్సిటీలు అందించే స్కాలర్షిప్ కు (scholarship for indian students in Russia) దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది.
దేశంలోని 89 ప్రాంతాల్లో 766 రష్యన్ విశ్వవిద్యాలయాలకు ఈ దరఖాస్తులను పంపవచ్చు. విద్యార్థులకు 200 గ్రాంట్ల వరకు స్కాలర్షిప్ అందిస్తారు.
అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, రిసెర్చి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నామని, ఇంజనీరింగ్, జనరల్ మెడిసిన్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, న్యూక్లియర్ ఫిజిక్స్, ఫిజిక్స్ కోర్సులకు ఈ స్కాలర్ షిప్లు ఇస్తామని రష్యా హౌస్ తెలిపింది.