ఇక విద్యార్థుల ఖాతాల్లోకి నేరుగా కేంద్రం వాటా స్కాలర్ షిప్.

ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ లలో కేంద్రం వాటాగా వచ్చే 60 శాతం సొమ్మును ఇక నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకి జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం రాబోయే ఐదు సంవత్సరాలలో 59 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఇందులో కేంద్రం వాటాగా 60 శాతంఅనగా 35.5 కోట్లను ఖర్చు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ సొమ్ము ను నేరుగా విద్యార్థుల ఖాతాలోకి జమ చేయనున్నారు.

పదవ తరగతి తర్వాత చదివే పై తరగతుల విద్యార్థుల ట్యూషన్ పీజు మరియు నెలవారీ ఖర్చులను స్కాలర్ షిప్ కింద అందిస్తున్నారు.

Follow Us@