SBI లో 6,100 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI)కు చెందిన ముంబయిలోని సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ విభాగం 6,100 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంపిక అయిన వారికి నెలకు 15,000/- స్టయిఫండ్ ఇస్తూ ఒక సంవ‌త్సరం పాటు శిక్షణ ఇవ్వనుంది.

వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో 100, తెలంగాణలో 125 ఖాళీలు కలవు.

● శిక్షణ కాలం :: ఒక్క సంవత్సరం

అర్హతలు :: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి డిగ్రీ సాదించి ఉండాలి.

● వయోపరిమితి :: అక్టోబర్ – 31 – 2020 నాటికి 20 నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్లు అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

● స్టయిఫండ్‌ :: నెలకు రూ.15000 స్టయిపెండ్‌ లభిస్తుంది. ఇతర ఎలాంటి అలవెన్సులు ఉండవు.

● ఎంపిక పద్దతి :: ఆన్లైన్‌ వ్రాత పరీక్ష, స్థానిక భాష పరీక్ష, మెడికల్‌ టెస్టుల ఆధారంగా ఎంపిక జరుగును.

● వ్రాత పరీక్ష విధానం :: ఆన్లైన్‌ విధానంలో ఆబ్జెక్టివ్‌ తరహాలో జరుగుతుంది. మొత్తం 100 ప్రశ్నలు–100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.

సిలబస్ లో నాలుగు విభాగాలు

  • జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌–25 ప్రశ్నలు–25 మార్కులు,
  • జనరల్‌ ఇంగ్లిష్‌–25 ప్రశ్నలు–25 మార్కులు,
  • క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌–25 ప్రశ్నలు–25 మార్కులు,
  • రీజనింగ్‌ ఎబిలిటీ అండ్‌ కంప్యూటర్‌ అప్టిట్యూడ్‌–25 ప్రశ్నలు–25 మార్కులకు ఉంటుంది.

పరీక్ష సమయం ఒక గంట, ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు నెగిటివ్ మార్కు ఉంటుంది. ప్రశ్న పత్రం ఇంగ్లిష్, హిందీ బాషలలో ఉంటుంది.

● దరఖాస్తు పద్ధతి :: ఆన్లైన్‌లో

● ఆన్లైన్‌ దరఖాస్తు ఆరంభ తేదీ :: జూలై – 06 – 2021

● చివరి తేదీ :: జూలై – 06 – 2021

● వెబ్సైట్‌ ::


https://bank.sbi/web/careers


https://apprenticeshipindia.org