- సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగించాలి
BIKKI NEWS (JAN. 03) : Savithribai phule jayanthi celebrations in gjc jangoan. అణగారిన వర్గాల జీవితాల్లో జ్ఞాన జ్యోతులు వెలిగించిన ఈ దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ,చదువుల తల్లి సావిత్రీ భాయి పూలే జయంతి నీ జరుపుకోవడం చాలా సంతోషం అని స్థానిక జనగామ ప్రభుత్వ జూనియర్ కళాశాల ( కో -ఎడ్యుకేషన్ ) ప్రిన్సిపాల్ నాముని పావని కుమారి అన్నారు.
Savithribai phule jayanthi celebrations in gjc jangoan
విద్యార్థుల, అధ్యాపకుల సమక్షంలో సావిత్రీ భాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి, విద్యార్థులకు మరియు అధ్యాపకులకు శుభాకాంక్షలు తెలిపారు. సావిత్రీ భాయి పూలే జయంతిని మొట్ట మొదటగా “మహిళా ఉపాధ్యాయ దినోత్సవం” గా ప్రకటించడం గొప్ప చారిత్రక పరిణామం అని, అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హృదయ పూర్వక ధన్యవాదములు తెలిపారు.
విద్యార్థులను, అధ్యాపకులను ఉద్దేశించి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఆనాటి సమాజం స్వార్థపరత్వం ఆసూయ ద్వేషాలకు, కులతత్వానికి నెలవుగా ఉండేది. నిమ్న వర్గాలపై, రైతులపై, మహిళలపై వివక్షతను, హింసను ప్రయోగిస్తున్న కాలంలో సావిత్రిబాయి పూలే విప్లవ వైతాకూరాలిగా మారి, బహుజన మహిళలలో అజ్ఞానం తొలగించేందుకు యాబదిపైగా పాఠశాలలు స్థాపించారు. వీరి కృషితో ప్రభుత్వం అనేక పాఠశాలల స్థాపనకు దారి పడింది.
మూఢనమ్మకాలపై శ్రమించి వారి జీవితాలలో వెలుగును నింపిన దీరవనిత, అన్ని వర్గాలకు అందుబాటులో విద్య అవకాశాలు ఉండాలని, భారత ప్రజాతంత్ర విద్యా విప్లవానికి ప్రారంభకురాలిగా చరిత్రలో నిలిచారన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకుల బృందం, అధ్యాపకేతర బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
- OU PhD Admissions 2025 – ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ అడ్మిషన్స్
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 15 – 01 – 2025
- GK BITS IN TELUGU JANUARY 15th
- చరిత్రలో ఈరోజు జనవరి 15
- CA EXAMS 2025 – సీఏ పరీక్షల షెడ్యూల్ ఇదే