75 సంవత్సరాల భారత ఆర్థిక వ్యవస్థ – గ్రంధం ఆవిష్కరణ

కరీంనగర్ (నవంబర్ – 16) : శాతవాహన విశ్వవిద్యాలయం ఎకనామిక్స్ విభాగం ఆచార్యురాలు డాక్టర్. కె. శ్రీవాణి సంపాదకీయంలో వెలువడిన “75 సంవత్సరాల భారత ఆర్ధిక వ్యవస్థ ” అనే పరిశోధనాత్మక గ్రంధంను గురువారం రోజున తన చాంబర్ లో శాతవాహన విశ్వవిద్యాలయ (Satavahana university) ఉపకులపతి ప్రొఫెసర్ సంకషాల మల్లేష్ ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా ఉపకులపతి మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో ఎన్నో మార్పులు వచ్చిన ఆర్థికపరమైన పురోగతి దిశలో దేశం సాగుతుందన్నారు. గ్రంధం సంపాదకురాలు డా. కే. శ్రీవాణి మాట్లాడుతూ గతంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ అండ్ రీసెర్చ్ (ICSSR), తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TSCHE) వారి ఆర్థిక సహకారంతో నిర్వహించిన జాతీయ సెమినారులో పాల్గొన్న అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన పరిశోధనా వ్యాసాలను క్రోడీకరించి ఈ గ్రంధం ముద్రించడం జరిగిందని చెప్పారు. బావి పరిశోధకులకు ఈ గ్రంధం ఎంతో ఉపయుక్తమని సూచించారు.

ఈ కార్యక్రమంలో రిజిస్టార్ ప్రొ. వరప్రసాద్, యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా. మహ్మద్ జాఫర్ జరి, కే. పద్మావతి, సోషియాలజీ విభాగాధిపతి, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని సంపాదకురాలు డా. కె. శ్రీవాణి కి అభినందనలు తెలియజేశారు.