కరీంనగర్ (జనవరి – 28) : జిల్లా కేంద్రంలోని శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సంకశాల మల్లేశం గారిని చరిత్ర పరిరక్షణ సమితి, తెలంగాణ బృందం శనివారం రోజున కలిసి యూనివర్సిటీలో చరిత్ర, ఆర్కియాలజీ మరియు టూరిజం డిపార్ట్మెంట్ ను ఏర్పాటు చేయాలని, శాతవాహన యూనివర్సిటీ ప్రాంగణంలో శాతవాహన వంశ మూలపురుషుడైన శాతవాహనుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతితో తప్పకుండా చరిత్ర డిపార్ట్మెంట్ ను ఏర్పాటు చేసి ఎం. ఏ. హిస్టరీ, ఆర్కీయలజీ మరియు టూరిజం వంటి నూతన పీజీ కోర్సులను ప్రవేశ పెట్టుటకు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చినట్లు చరిత్ర పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పోతరవేణి తిరుపతి తెలిపారు.
వైస్ ఛాన్సలర్ ను కలిసిన చరిత్ర పరిరక్షణ సమితి బృందంలో వ్యవస్థపాకులు డాక్టర్ సందవేణి తిరుపతి, ఎస్ ఆర్ ఆర్ చరిత్ర డిపార్ట్మెంట్ శాఖాది పతి కె.సుధాకర్. అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఏ. రామకిషన్, జి. రాజేందర్, కె. రామచంద్రం, బి. రాజు తదితరులు పాల్గొన్నారు.
Follow Us @