హైదరాబాద్ (సెప్టెంబర్ – 11) : సంతూర్ విమెన్ స్కాలర్షిప్ ప్రోగ్రాం, ఇంటర్ తరువాత పై చదువులు చదవటానికి ఆర్థిక స్థోమత లేని అమ్మాయిలకు మంచి అవకాశం. ఇందులో ట్యూషన్ మరియు విద్యకి సంభందించిన ఖర్చులు మంజూరు అవుతాయి.
ఈ కార్యక్రమం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ ఘఢ్ మరియు తెలంగాణ రాష్ట్రాల లో చదువుకునే అవకాశం లేని బాలికా విద్యార్థులకు వర్తిస్తుంది.
◆ అర్హతలు : దరఖాస్తుదారులు తప్పక ప్రభుత్వ పాఠశాల/కాలేజ్ నుంచి 2021-22 విద్యా సంవత్సరంలో ఇంటర్ పాస్ అయి ఉండాలి. పదవ తరగతి గవర్నమెంట్ పాఠశాలలో పాస్ అయి ఉండాలి.
ఏదైనా గుర్తింపు పొందిన కళాశాలలో 2022 – 23 సంవత్సరం మొదలయ్యే ఫుల్ టైం డిగ్రీ జాయిన్ అయి ఉండాలి. డిగ్రీ కోర్స్ కనీసం మూడు సంవత్సరాలు ఉండాలి.
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ను నుంచి డౌన్లోడ్ చేసుకోనవచ్చు. వెబ్ సైట్ లో ఆన్లైన్లోనే అప్లై చేసుకొనవచ్చు.
◆ ముఖ్యమైన తేదీలు : ఆగస్టు 18 నుంచి అప్లికేషన్స్ అందుబాటులోకి రానున్నాయి. దరఖాస్తు చేసుకునే ఆఖరి తేదీ అక్టోబర్ 15 – 2022.
◆ స్కాలర్ షిప్ ఎమౌంట్ : సంవత్సరానికి 24 వేలు
◆ వెబ్సైట్ : www.santoorscholarships.com
◆ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కు గురించిన మరిన్ని వివరాల కోసం సంప్రదించండి చూడండి లేదా +91 7337835166 నెంబర్ కి కాల్ చేయండి లేదా. santoor.scholarship buddy4study.com కి ఇ-మెయిల్ చేయండి.