ప్రభుత్వ జూనియర్ కళాశాల – కారెపల్లి విద్యార్థినికి సంతూర్ స్కాలర్ షిప్

ప్రభుత్వ జూనియర్ కళాశాల – కారెపల్లిలో 2018 – 2020 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ HEC గ్రూప్ పూర్తి చేసుకున్న సమీలా అనే విద్యార్థినికి విప్రో గ్రూప్ అందిస్తున్న సంతూర్ మెరిట్ స్కాలర్ షిప్ కి ఎంపికయింది.

ఈ సంతూర్ మెరిట్ స్కాలర్ షిప్ కింద విద్యార్ధినికి డిగ్రీ అభ్యసించిన మూడు సంవత్సరాల పాటు సంవత్సరానికి 24 వేల చొప్పున స్కాలర్ షిప్ గా అందనున్నాయి.

ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థిని సమీలాను ప్రిన్సిపాల్ సింహాచలం మరియు కళాశాల టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది అభినందించారు. ఈ సందర్భంగా సమీలా మాట్లాడుతూ తమది కొమ్ము గూడెం అని, వ్యవసాయ కుటుంబం నుండి వచ్చానని తమది మద్య తరగతి కుటుంబం అని, ఈ స్కాలర్ షిప్ తన పై చదువులకు ఎంతో ఉపయోగపడుతుందని నాకు ఈ స్కాలర్ షిప్ రావడానికి ప్రధాన కారణం కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులు అని అలాగే స్కాలర్ షిప్ అందించిన విప్రో గ్రూప్ కు ధన్యవాదాలు తెలిపింది. తాను డిగ్రీ అభ్యసిస్తూ సివిల్స్, గ్రూప్స్ వంటివి ప్రపేర్ అవుతానని తెలిపింది.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సింహాచలం మాట్లాడుతూ తమ కళాశాలకు చదివిన విద్యార్థినికి సంతూర్ మెరిట్ స్కాలర్ షిప్ దక్కడం సంతోషంగా ఉందని విద్యార్థినిని మరియు కళాశాల సిబ్బందిని అభినందించారు.

Follow Us@