BIKKI NEWS (APR. 09) : Sanskrit as second language in gjcs issue. రాబోవు విద్యా సంవత్సరంలో అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెకండ్ లాంగ్వేజ్ గా సంస్కృత పెట్టాలనే విషయంపై ఇంటర్ డైరెక్టర్ గారు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ – 475 అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి. శ్రీనివాస్, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ లు తెలిపారు.
Sanskrit as second language in gjcs issue
ఈరోజు రోజు తెలంగాణ ఇంటర్ విద్య రీజనల్ జాయింట్ డైరెక్టర్ గారు జారీ అన్ని జిల్లాల DIEO/ NODEL OFFICER మరియు అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లకు జారీ చేసిన file no RJD I.E – SER 2/ SMJL/ 2025- SER-2 ప్రకారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంస్కృతం బోధించడానికి కావలసిన సమాచారాన్ని పంపించవలసిందిగా సర్కులర్ పంపించడం జరిగిందని, గత ప్రభుత్వంలో కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంస్కృతాన్ని బోధించడానికి తెరవెనక కొంతమంది పెద్దమనుషులు, ప్రభుత్వ పెద్దలు పాల్గొన్న సందర్భంలో మెజార్టీ అధ్యాపక, విద్యార్థి సంఘాలు, తెలుగు సాంస్కృతిక సంఘాలు, ముచ్చింతలలో చిన్న జీయర్ స్వామి గారిని కలిసి… ఈ విషయంపై పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తమ సంఘము నుంచి కూడా పాల్గొనడం జరిగిందని… తాత్కాలికంగా ఆ ప్రయత్నం గత ప్రభుత్వంలో నిలిపివేయడం జరిగిందని తెలుపుతూ… మరల ఏ అధ్యాపక సంఘాలతో కూడా చర్చించకుండా విద్యార్థి సంఘాలు, విద్యార్థులతో చర్చించకుండా మార్కుల కోసమే కార్పొరేట్ కళాశాలలో బోధించే ఈ సబ్జెక్టును అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బోధించాలనే ప్రయత్నం వల్ల ఏం ఉపయోగం అని, సంస్కృతంలో చదివే విద్యార్థులు ఆ పరీక్షలు సంస్కృతంలో రాయటం లేదని, కేవలం మార్కుల కోసమే సంస్కృతమునుcఒక సబ్జెక్టుగా కార్పొరేట్ కళాశాలలో వాడుకుంటున్నాయని తెలియజేస్తూ… దీనిపై తెర వెనకగా సచివాలయ స్థాయిలో Govt memo no35/ I.e /A1/2023 date 27/08/2024 రావటం జరిగిందని తెలుపుతూ… దీనిపై తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని ,ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు జీవనోపాధికి, జ్ఞానానికి ఉపయోగపడే అనేక కొత్త కోర్సులు పెట్టడానికి అవకాశం ఉందని,
అదేవిధంగా ఇంటర్ విద్యా పర్యవేక్షణకు జిల్లాలలో DIEO POST శాంక్షన్ చేసి తక్షణం భర్తీ చేయాలని, నూతనంగా సాంక్షన్ చేసిన 36 ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ప్రిన్సిపాల్, టీచింగ్, నాన్- టీచింగ్ పోస్టులు శాంక్షన్ చేయాలని, వీటిని గురించి ఆలోచించాలని ప్రభుత్వానికి మరియు తెలంగాణ ఇంటర్ విద్య డైరెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్