“సంస్కృతం” పై ఇంటర్మీడియట్ బోర్డు వివరణ

ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మరియు ప్రైవేట్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో సంస్కృతం భాషను సెకండ్ లాంగ్వేజ్ గా ప్రవేశ పెట్టడం పై నిరసనల నేపథ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు వివరణ ఇచ్చింది.

తెలంగాణ సంస్కృత భాష అధ్యాపకుల సంఘము మరియు తెలంగాణ సంస్కృత విద్యార్థులు స్కాలర్స్ సంఘం వినతి మేరకు ఎమ్మెల్సీ కవిత రిఫరెన్స్ లేఖ ఇచ్చారాని దాని ఆధారంగానే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలలో సంస్కృత భాష డిమాండ్ ఉందా లేదా అని సమాచారాన్ని సేకరించమని మాత్రమే ప్రిన్సిపాల్స్ ని నిన్న ఇచ్చిన మెమోలో అడగడం జరిగిందని పేర్కొన్నారు.

ఖచ్చితంగా సెకండ్ లాంగ్వేజ్ గా సంస్కృతం ప్రవేశపెట్టాలని ఉత్తర్వులు ఇవ్వలేదని కేవలం డిమాండ్ ఉందా లేదా అని సమాచారాన్ని సేకరించమని మాత్రమే అడిగామని ఇంటర్మీడియట్ బోర్డు వివరణ ఇచ్చింది.