‘సంస్కృతం’ పై మెమోను రద్దు చేయాలి – TIPS

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతం విషయంలో ముప్పు పొంచి వుంది – భవిష్యత్ కార్యాచరణకు సిద్ధం అవుదాం-తెలుగు భాషను పరిరక్షించుకోవడానికి తెలుగు భాషా పండితులు, అధ్యాపకులు, సాహితీవేత్తలు, భాషాభిమానులు తెలుగు భాషా పరిరక్షణ కొరకు ఆదివారం హైదరాబాదులో తెలుగు భాషా చైతన్య సమితి, తెలుగు భాష కూటమి మరియు తెలుగు భాషాభిమానులు ఏర్పాటుచేసిన సమావేశంలో గత సంవత్సరం కాలంగా కొందరు దళారీలు, బ్రోకర్లు, పైరవీకారులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా కుట్రలు కుతంత్రాలతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంస్కృతంను సెకండ్ లాంగ్వేజ్ గా పెట్టాడాన్ని తీవ్రంగా ఖండించారు.

ఇంటర్ వ్యవస్థలో పనిచేస్తున్న వ్యక్తులే కార్పొరేట్ విద్యా సంస్థలతో కుమ్మక్కై మార్కుల భాష (సంస్కృతం)ను ద్వితీయ భాషగా ఇంటర్మీడియట్ లో ప్రవేశ పెట్టడానికి విఫల ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇంటర్ విద్యా కమీషనర్ కార్యాలయం నుంచి వచ్చిన మెమోను తెలుగు భాషా పండితులు, అధ్యాపకులు, సాహితీవేత్తలు, భాషాభిమానులు అందరు జాగ్రత్త వహించి పూర్తిగా రద్దు చేయకపోతే మనమంత భవిష్యత్ కార్యక్రమాలకు సిద్ధం అవ్వాలని ఈరోజు జరిగిన సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది.

త్వరలో జరుగబోవు ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మనమందరం ఐక్యమత్యం, అంకితభావంతో కృషి చేస్తూ “తెలుగు భాష పరిరక్షణ” కు చేపట్టే అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని
తెలుగు భాషను కాపాడుకోవాలని కోరుతూ మీరు ప్రకటించిన ప్రతి కార్యక్రమంలో తమ విధిగా ” తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి” పాల్గొని మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తు అండగా వుంటుందని తెలియజేస్తున్నాం TIPS ప్రతినిధులు తెలిపారు.