“సంస్కృతం” ఉపసంహరణ పై కమీషనర్ నుంచి స్పష్టమైన హామీ – TIPS

ఈ నెల 9 వ తేదిన ప్రభుత్వ, ప్రైవేట్ AIDED జూనియర్ కళాశాలలో సెకండ్ లాంగ్వేజ్ లో “సంస్కృతం” ను చేర్చాలని ఇంటర్ విద్య కమిషనర్ ఇచ్చిన మెమో పై వివాదం జరుగుతున్న సమయంలో ఈ విషయంపై స్పష్టమైన హామీ ఇవ్వాలని గత రెండు రోజులుగా ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి(TIPS) ఆధ్వర్యంలో తెలుగు భాషా చైతన్య సమితి, తెలుగు భాష, హిందీ భాష లెక్చరర్స్ మరియు, భాషా సాహిత్య అభిమానులు, తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్, టీజీవో ఇంటర్ విద్యా ఫోరమ్ రకరకాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది.

ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు ఈరోజు ఇంటర్ విద్యా కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ ని కలిసి తమ ఆందోళనను, నిరసనను వినతిపత్రం రూపంలో వ్యక్తం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఇంటర్ విద్య కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ స్పందిస్తూ “సంస్కృతం” సెకండ్ లాంగ్వేజి హగా ప్రవేశపెట్టే విషయంలో గతంలో ఇచ్చిన మెమోను ఉపసంహరిస్తామని స్పష్టమైన హామీని లిఖితరూపంలో ఈరోజు ఇస్తామని తెలియజేయడం జరిగిందని TIPS నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రామకృష్ణ గౌడ్, కొప్పిశెట్టి సురేష్ మరియు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు…