“సంస్కృతం” పై ఇంటర్ బోర్డు వివరణలో స్పష్టత లేదు – కొప్పిశెట్టి సురేష్

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెకండ్ లాంగ్వేజ్ గా సంస్కృతము చేర్చే విషయంపై నిన్న ఇంటర్ బోర్డు జారీ చేసిన మెమో పై అనేక రకాలుగా వ్యతిరేకత రావడంతో ఇంటర్ బోర్డు ఈ రోజు ఇచ్చిన వివరణ లో స్పష్టత ఇవ్వకుండా దాటవేయడం సరైన చర్య కాదని ఇప్పటికైనా ఇంటర్ బోర్డు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భవిష్యత్తులో కూడా సంస్కృతం సెకండ్ లాంగ్వేజి లో చేర్చమని స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందిగా 475 సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ డిమాండ్ చేశారు.

సంస్కృతం బోధించే లెక్చరర్స్, సంస్కృతం రీసెర్చ్ స్కాలర్స్ ఇచ్చిన రిప్రజెంటేషన్ పై సంస్కృత సెకండ్ లాంగ్వేజ్ గా పెట్టాలని భావించినట్లు, ఇంటర బోర్డు క్లారిఫికేషన్ లో చెప్పడం జరిగిందని కానీ సంస్కృతి భాషా విషయంపై విద్యార్థుల & తల్లిదండ్రుల నుంచి గానీ, ఎటువంటి డిమాండ్ లేనప్పటికీ, ప్రభుత్వం నుంచి కానీ ఇంటర్ బోర్డు పాలక మండలి నుంచి గానీ అనుమతి లేకుండా సంస్కృతం సెకండ్ లాంగ్వేజ్ పై ఇంటర్ బోర్డు తొందరపాటుగా మెమో జారీ చేసింది అని మేము భావిస్తున్నామని తెలిపారు.

భవిష్యత్తులో కూడా సెకండ్ లాంగ్వేజ్ గా సంస్కృతం ప్రవేశ పెట్టబోమనే స్పష్టమైన హమీ రాకుంటే తెలుగు, హిందీ లెక్చరర్స్ మరియు తెలుగు భాషాభిమానులు చేసే కార్యక్రమాలు కు పూర్తి మద్దతును తమ సంఘం ఇచ్చి వారు నిర్వహించే కార్యక్రమలలో పాల్గొంటామని కొప్పిశెట్టి స్పష్టం చేశారు