ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్ జూ. కళాశాలలో సెకండ్ లాంగ్వేజ్ గా సంస్కృతం – బోర్డు

ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మరియు ప్రైవేట్ జూనియర్ కళాశాలలో సంస్కృతం భాషను సెకండ్ లాంగ్వేజ్ గా ప్రవేశ పెట్టాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.

సంస్కృతం భాషను సెకండ్ లాంగ్వేజ్ గా ప్రవేశ పెట్టాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖ పై స్పందిస్తూ ఈ నిర్ణయం బోర్డు తీసుకుంది.

ఇప్పటికే తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ, కన్నడ వంటి భాషలు ఉన్న నేపథ్యంలో సంస్కృతంను కూడా సెకండ్ లాంగ్వేజ్ గా ప్రభుత్వ మరియు ప్రైవేటు ఎయిడెడ్ కళాశాలలో తీసుకోవాలని సంబంధిత డీఐఈవోలకు, ప్రిన్సిపాల్ లకు ఇంటర్మీడియట్ బోర్డ్ ఆదేశాలు జారీ చేసింది.