ప్రభుత్వ జూ. కళాశాలలో సంస్కృతంను సెకండ్ లాంగ్వేజ్ లో అనుమతివ్వడం బోర్డు తొందరపాటు చర్య – 475 ASSN

తెలంగాణ రాష్ట్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంస్కృతమును సెకండ్ లాంగ్వేజ్ లో బోధించడానికి ఈరోజు ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేయడాన్ని తొందరపాటు చర్యగా భావిస్తున్నామని 475 సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

కొప్పిశెట్టి సురేష్ మాట్లాడుతూ ప్రస్తుతం కొన్ని కార్పొరేట్ కాలేజీలలో విద్యార్థులు మార్కులు పెరగటానికి ఒక మార్గంగా చాలామంది సంస్కృతం సెకండ్ లాంగ్వేజ్ గా ఎంచుకుంటున్నారు. దీని వలన ప్రస్తుతం సమాజంలో పెద్ద ప్రభావం, ఉపయోగము ఏమీ లేదని తెలిపారు.

అలాగే జాతీయ భాషగా హిందీ మరియు ప్రాచీన భాష హోదా గురించి ప్రయత్నిస్తున్న తెలుగు భాష కు నష్టం జరిగే అవకాశం ఉన్నది. ఈ మార్పు పై విద్యావేత్తలతో గాని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సంబంధించిన వారితో ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా నిర్ణయంగా భావిస్తూ, ఇంటర్ బోర్డు ఈ విషయంపై తగిన సంప్రదింపులు జరిపి పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని కొప్పిశెట్టి సురేష్ తెలిపారు.