“సంస్కృతం” పై వెనక్కి తగ్గిన ఇంటర్ బోర్డు.!

  • తెలుగు భాషాభిమానుల విజయం
  • రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల ఫలితం

ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మరియు ప్రైవేట్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో సంస్కృతం భాషను సెకండ్ లాంగ్వేజ్ గా ప్రవేశ పెట్టాలని ఇంటర్మీడియట్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న నిరసనలతో వెనక్కి తగ్గినట్లు సమాచారం.

తెలుగు భాషాభిమానులు, సాహీతీవేత్తలు, విద్యా రంగ నిపుణులు, ఇంటర్మీడియెట్ విద్య లోని వివిధ సంఘాల నాయకులు ఈ చర్యను తీవ్రంగా తప్పుపట్టారు. సోషల్ మీడియా వేదికగా తమ నిరసనలు తెలిపారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు నగరాలలో కాళోజీ విగ్రహాల ముందు తమ నిరసన గళం వినిపించారు.

ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మరియు ప్రైవేట్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో సంస్కృతం భాషను సెకండ్ లాంగ్వేజ్ గా ప్రవేశ పెట్టాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.