సంసద్ రత్న అవార్డుకు 11 మంది ఎంపీలు ఎంపిక

అత్యుత్తమ పనితీరు కనబరిచే పార్లమెంటు సభ్యులకు వివిధ విభాగాల్లో అందించే ‘సంసద్ రత్న అవార్డు-2022’కు 11 మంది ఎంపీలు ఎంపికైనట్టు ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ తెలిపింది. వీరిలో 8 మంది లోకసభ సభ్యులు, ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఉన్నారని వెల్లడించింది. వీరిలో ముగ్గురికి సంసద్ విశిష్ట రత్న అవార్డు దక్కింది.

అవార్డు కు ఎంపికైన ఎంపీలు :

  • ఎన్సీపీ ఎంపీలు సుప్రీయా సూలే(సంసద్ విశిష్ట రత్న) , ఫౌజియా తహసీన్ అహ్మద్ ఖాన్,(సంసద్ విశిష్ట రత్న),శివసేన ఎంపీ శ్రీరంగ్ అప్పా బర్నే(సంసద్ విశిష్ట రత్న),టీఎంసీ ఎంపీ సౌగతారాయ్, బీజేడీ ఎంపీ అమర్ పట్నాయక్, కాంగ్రెస్ ఎంపీ కుల్దీప్ రాయ్, బీజేపీ ఎంపీలు బిద్యుత్ బాథన్ మహతో‌, హీనా‌, విజయ్ కుమార్, సుదీర్ గుప్తా, కేకే రాగేష్ ఉన్నారని పేర్కొంది. ఈ నెల 26న ఢిల్లీలో సంసద్ రత్న అవార్డు ప్రధాన కార్యాలయం నిర్వహించనున్నట్లు వివరించింది.
Follow Us @