సిద్దిపేట (డిసెంబర్ – 12) : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల క్రమబద్దీకరణకు ఎలాంటి ఆటంకాలు లేకుండా త్వరగా జరగటానికి గజ్వేల్ నుంచి సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి గుడి వరకు డిసెంబర్ 10 నుంచి 12 వరకు చేపట్టిన సంకల్ప ఆశీస్సు యాత్ర ఈరోజు విజయవంతంగా పూర్తైనట్లు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జి. రమణారెడ్డి & డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ లు తెలిపారు.
సందర్భంగా ఈ సంకల్ప ఆశీస్సుల యాత్రకు సహకరించిన టీఎస్ యుటిఎఫ్, ఎస్ఎఫ్ఐ, ప్రెస్ వారికి, మీడియా వారికి ప్రభుత్వ అధికారులకు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
కాంట్రాక్టు ఉద్యోగులు/లెక్చరర్ల బాధలను ప్రత్యక్షంగా చూసిన ముఖ్యమంత్రివర్యులు కే చంద్రశేఖర రావు గారు 2016 సంవత్సరంలో జీవో నెంబర్ 16 ద్వారా క్రమబద్దీకరణకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కానీ అనివార్య కారణాలవల్ల కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ ఇంతవరకు జరగలేదు. ఎటువంటి ఆటంకాలు లేకుండా త్వరగా కాంట్రాక్టు లెక్చర్లందరి క్రమబద్ధీకరణకు గౌరవ ముఖ్యమంత్రివర్యులు కే చంద్రశేఖర రావు గారి ఇష్టదైవం కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మన అందరిపై ఉండాలని కోరుతూ… డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 12 వరకు కొనాయిపల్లి వెంకటేశ్వర స్వామి గుడి యాత్ర నిర్వహించడం జరిగిందని తెలిపారు మూడో రోజు పాదయాత్ర సిద్దిపేటలోని లక్ష్మీనరసింహ టెంపుల్ నుంచి నాంచార్ పల్లి, ఎలకటూరు నుంచి కోనాయిపల్లి వెంకటస్వామి దేవాలయం వరకు చేరుకుంది, అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, తమ వినతి పత్రం స్వామి ఆశీస్సులు కొరకు పాదాలు ముందు ఉంచడం జరిగింది.
ఈ సంకల్ప ఆశీస్సుల యాత్ర మూడో రోజు తెలంగాణ పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జీ ఉదయ భాస్కర్ మరియు తెలంగాణ ఆల్ యూనివర్సిటీ కాంటాక్ట్ టీచర్స్ అసోసియేషన్ డాక్టర్ శ్రీధర్ లోడి, సిద్దిపేట యూనివర్సిటీ పీజీ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ రవి నాథ్, కోనేపల్లి వచ్చి సంకల్ప యాత్రకు ఆశీస్సులు అందజేయడం జరిగింది
ఈ పాదయాత్ర 475 అసోసియేషన్ రాష్ట్ర నాయకులు డాక్టర్ వి శ్రీనివాస్, డా. కాంపల్లి. శంకర్, శోభన్ బాబు, గంగాధర్, గోవర్ధన్, షాహినా, కృష్ణవేణి, కురుమూర్తి, దేవేందర్, శ్రీనివాస్ రెడ్డి, సంగీత రాష్ట్ర నాయకులు రాధాకృష్ణ, వికారాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మహేందర్, రమేష్, గద్వాల జిల్లా నాయకులు చక్రపాణి రెడ్డి, వనపర్తి జిల్లా నాయకులు యాదగిరి గౌడ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మనోహర్, గాయత్రి, రాజేశ్వర్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్, నిజాంబాద్ జిల్లా నాయకులు ప్రవీణ్, సిరిసిల్ల జిల్లా నాయకులు విజయ్ కుమార్, ఖమ్మం జిల్లా కార్యదర్శి పోలూరు మురళి, పెద్దపల్లి అధ్యక్షులు సునీల్, హనమకొండ నాయకులు రవీందర్, మహబూబాద్ జిల్లా నాయకులు డా. యు. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
