హైదరాబాద్ (ఫిబ్రవరి – 03) : తెలంగాణ రాష్ట్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల వేతనాలను చెల్లించేందుకు డ్రాయింగ్ ఆపీసర్లగా కళాశాల ప్రిన్సిపాల్లకు అధికారం కలిపిస్తూ ఇంటర్మీడియట్ కమిషనరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 2023 నుండి ప్రిన్సిపాల్ లు డ్రాయింగ్ ఆఫీసర్లుగా ఉండనున్నారు.
ఇది వరకు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు డ్రాయింగ్ ఆఫీసర్లుగా ఉండేవారు. ఆయా జిల్లాల్లోని ఏ ఒక్క కాలేజీ బిల్లులు సమర్పించకపోయినా ఆయా జిల్లాలోని లెక్చరర్ల వేతనాలు నిలిచి పోయేవి. దీనికి ముగింపు పలుకుతూ.. వేతనాలకు డ్రాయింగ్ ఆఫీసర్ బాధ్యతలను ఆయా కాలేజీ ప్రిన్సిపాళ్లకు అప్పగించారు. ఆధార్ బయోమెట్రిక్ హాజరు ఆధారంగా వేతనాలు ఇవ్వాలని పేర్కొన్నారు.