SAFF FINAL : నేడే కువైట్ తో ఛెత్రీ సేన ఫైనల్ పోరు

బెంగళూరు (జూలై – 04) : SAFF FOOT BALL CHAMPIONSHIP 2023 FINAL మ్యాచ్ ఈ రోజు INDIA vs KUWAIT మద్య జరగనుంది. ఇప్పటికే శాఫ్ పుట్‌బాల్ ఛాంపియన్స్ షిప్ ను 8 సార్లు గెలుచుకున్న భారత జట్టు తొమ్మిదో టైటిల్ పై కన్నేసింది. 2005 తర్వాత స్వదేశంలో భారత్ ఏ టోర్నీలోనూ ఫైనల్లో ఓడిపోలేదు.

ఈ టోర్నీలో లీగ్ దశలో కువైట్ తో జరిగిన మ్యాచ్ను భారత్ 1-1తో డ్రా చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫైనల్లో మరింత మెరుగ్గా ఆడి టైటిల్ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది.

కెప్టెన్ చెత్రినే జట్టుకు కీలకం కానున్నాడు. లీగ్ దశలో మూడు మ్యాచ్ నూ గోల్ కొట్టిన ఈ స్టార్.. ఫైనల్లో చెలరేగుతాడని భారత్ ఆశలు పెట్టుకుంది. వరుసగా రెండు ఎల్లో కార్డులు రావడంతో లెబనాన్ పై ఆడలేకపోయిన కీలక డిఫెండర్ సందేశ్ తిరిగి జట్టులోకి చేరడం భారత్ బలాన్ని పెంచింది. అన్వర్ అలీ స్థానంలో అతడు ఆడనున్నాడు. ఉదాంత సింగ్
ఫామ్ కూడా కీలకమే. అయితే కువైట్ తో పోరు అంత సులభం కాదని ఛెత్రి బృందానికి తెలుసు.

“కువైట్ తో హోరాహోరీ ఖాయం. సాంకేతికంగా ఆ జట్టు బలంగా ఉంది. మా పోరాటాన్ని ఏమాత్రం ఆపినా వెంటనే స్కోరు చేసే సత్తా కువైట్ కు ఉంది” అని సందేశ్ చెప్పాడు.

★ మరిన్ని వార్తలు