లెక్చరర్ ల క్రమబద్ధీకరణపై విద్యా శాఖ మంత్రి కీలక రివ్యూ మీటింగ్

  • పాల్గొన్న విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి,
    ప్రిన్సిపల్ సెక్రటరీ వాకటి కరుణ, ఇంటర్ కమీషనర్ ఉమర్ జలీల్.
  • బుధవారంలోపు లెక్చరర్ ల జాబితాను ఉన్నత విద్యా శాఖకు పంపాలని ఆదేశం.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేస్తామని ఇచ్చిన హామీ ప్రకారం క్రమబద్ధీకరణ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ జాబితా ఇంత వరకు ఉన్నత విద్యాశాఖకు చేరకపోవడంతో ఈరోజు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిల ఆధ్వర్యంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ మరియు ఇంటర్ విద్య కమిషనర్ ఉమర్ జలీల్ మరియు కాంట్రాక్ట్ అధ్యాపక నేతలతో కీలకమైన రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది.

ఈ మీటింగ్ లో కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ లో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని సబితా ఇంద్రారెడ్డి అధికారుల దృష్టికి తీసుకు వచ్చి రెండు రోజుల్లో క్రమబద్ధీకరణకు సంబంధించి జాబితాను ఉన్నత విద్యా శాఖకు పంపించాలని ఇంటర్ విద్య కమిషనర్ కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

★ జాబితాలు త్వరగా సిద్ధం చేయాలి.

అలాగే యూనివర్సిటీల గుర్తింపు, కాంట్రాక్ట్ జే.ఎల్. గా చేరినప్పటి వయస్సు విషయంలో మినహాయింపు పై ఎలాంటి సమస్యలు లేకుండా పారదర్శకతతో కూడిన జాబితాను ఉన్నత విద్యా శాఖ పంపించాలని పేర్కొన్నారని, జీవో నంబర్ 16లో ఎక్కడ వయస్సు అంశం లేదని గాదె వెంకన్న తెలిపారు.

★ వొకేషనల్ లో సమస్యలు పరిష్కరించాలి

వొకేషనల్ విభాగంలో జీవో నెంబర్ 12 కాకుండా కాంట్రాక్టు అధ్యాపకులు నియామకమైన జీవో నెంబర్ 101, 109, 483ల ప్రకారం నియామకాలు జరిగినప్పుడు ఉన్న అర్హతల ప్రకారమే జాబితాను సిద్ధం చేయాలని పేర్కొనడం జరిగిందని గాదె వెంకన్న తెలిపారు. అలాగే రాష్ట్ర విభజన సమయంలో కమలనాథన్ కమిటీ వొకేషనల్ విభాగంలో 842 పోస్టులను తెలంగాణకు కేటాయించిందని గుర్తు చేశారు. వాటిని గుర్తించి కాంట్రాక్ట్ లెక్చరర్ ల క్రమబద్ధీకరణ లో నాన్ శాంక్షన్ పోస్టుల సమస్య పరిష్కారించాలని తెలిపారు.

★ అన్ని సబ్జెక్టుల జాబితా పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి.

పబ్లిక్ డొమైన్ లో ఇంకా చేర్చని ఎనిమిది సబ్జెక్టుల జాబితాను వెంటనే పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉంచి ఎలాంటి కరెక్షన్స్ లేకుండా వీలైనంత త్వరగా జాబితాలను సిద్ధం చేయాలని ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి పేర్కొన్నట్లు వెంకన్న తెలిపారు.

★ పల్లాకు రుణపడి ఉంటాం

అలాగే క్రమబద్ధీకరణ ప్రక్రియలో కాంట్రాక్ట్ లెక్చరర్లకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి రివ్యూ మీటింగ్ లో పాల్గోని కమిషనర్ కు కీలక సూచనలు చేసినట్లు వెంకన్న పేర్కొన్నారు. నిన్న జరిగిన ఆర్జేడీ అపాయింటెడ్ కాంట్రాక్ట్ లెక్చరర్లు పల్లా తో భేటీ అనంతరం… వివిధ అంశాలపై స్పష్టమైన ఆదేశాలు కమిషనర్ కు అందించడం పట్ల గాదె వెంకన్న, యార. కుమారులు పల్లాకు జీవితాంతం రుణపడి ఉంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ సందర్భంగా గాదె వెంకన్న మాట్లాడుతూ కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ ప్రక్రియ జరిగే వరకు నిరంతరం కృషి చేస్తామని ఎలాంటి అపోహలకు గురికావోద్దని కాంట్రాక్టు లెక్చరర్లకు పిలుపునిచ్చారు.

Follow Us @