Home > TELANGANA > RYTHU BANDHU – రైతు బంధు కోసం రైతుల ఎదురుచూపులు

RYTHU BANDHU – రైతు బంధు కోసం రైతుల ఎదురుచూపులు

హైదరాబాద్ (డిసెంబర్ – 24) : తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రైతుబంధు (Rythu Bandhu Scheme in telangana) కింద డిసెంబర్ మాసానికి (రభీ సీజన్) సంబంధించిన నిధులు జమ కావడం లేదు. గతంలో ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయిన రైతుబంధు నిధుల జమ ఇంకా పూర్తి కాలేదు ఇప్పటికే రభీ సీజన్ ప్రారంభమై రోజులు గడుస్తున్న రైతుబంధు నిధులు జమ కావడం లేదని పలువురు రైతులు తెలియజేస్తున్నారు.

రైతుబంధు నిధులు మొదటగా ఎకరం లోపు ఉన్న రైతులకు జమ చేస్తారు, తర్వాత రెండు ఎకరాల లోపు, తరువాత మూడు ఎకరాల లోపు, తరువాత నాలుగు ఎకరాల లోపు, అటు తర్వాత ఐదు ఎకరాలలోపు ఉన్న రైతులకు జమ చేస్తారు. చివరిగా ఐదు ఎకరాల పైబడిన రైతులకు రైతుబంధు నిధులు జమ చేస్తారు.

అయితే ఇంతవరకు ఎకరం లోపు ఉన్న రైతులకు పూర్తిగా రైతుబంధు నిధులు తమ ఖాతాలలో జమ కానట్లు సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం దాదాపుగా 69 లక్షల మంది రైతులు రైతు బంధు కింద నమోదై ఉన్నారు. వీరందరికీ రైతుబంధు కింద 7,625 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో ఎకరాలోపు ఉన్న రైతులు 22.55 లక్షల మంది ఉన్నారు. వీరికి 642 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు కేవలం ఇందులో సగం మందికి మాత్రమే రైతుబంధు నిధులు జమ అయినట్లు సమాచారం.

ఇంకా దాదాపు 58 లక్షల మంది రైతులు రైతుబంధు నిధుల కోసం ఎదురుచూస్తున్నట్లు అధికారులు తెలిపారు ఖజానాలో నిధులు లేకపోవడంతోనే రైతుబంధు నిధులు జమ చేయడం లేదని అధికారులు తెలియజేస్తున్నారు. డిసెంబర్ నెల తరువాత అయినా రైతుబంధు నిధులు పూర్తిగా జమ అవుతాయా లేదా అనేది సందేహమే అని అధికారులు చెబుతున్నారు.

★ ఎకరాల వారీగా రైతుల సంఖ్య – అవసరమైన నిధులు
  • 1-2 ఎకరాలు – 16.98 లక్షల మంది -1,278.60 కోట్లు
  • 2-3 ఎకరాలు – 10.89 లక్షల మంది – 1,325.24 కోట్లు
  • 3-4 ఎకరాలు – 6.64 లక్షల మంది – 1,131 కోట్లు
  • 4-5 ఎకరాలు – 5.26 లక్షల మంది – 1,052 కోట్లు
  • 5 ఎకరాల పైబడి – 6 65 లక్షల మంది – 2,600 కోట్లు