BIKKI NEWS (FEB. 11) : వ్యవసాయం చేయని భూములకు రైతు భరోసా (రైతు బంధు) పథకం నిలిపివేయాలని (rythu bandhu scheme for tenant farmers) రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం బడ్జెట్ ప్రసంగంలో స్పష్టత ఇచ్చారు. వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఎకరాకు రూ.7,500 చొప్పున పంపిణీ చేయనున్నారు. అంటే రెండు సీజన్లకు కలిపి ఏడాదికి రూ.15వేలు అందజేస్తారు. ‘రైతు భరోసా’ పేరుతో ఈ పథకం అమలులోకి రానుంది.
‘ధరణి’ పోర్టల్ ప్రకారం… రాష్ట్రంలో కోటిన్నర ఎకరాలు (151 లక్షల ఎకరాలు) వ్యవసాయ భూముల ఖాతాలో ఉన్నాయి. కానీ, వీటిలో 132లక్షల ఎకరాలు మాత్రమే సాగులో ఉన్నాయి. సుమారుగా 19లక్షల ఎకరాలు సాగుకు యోగ్యంగా లేకున్నా వ్యవసాయ భూముల జాబితాల ఉన్నాయి. వీటిని రైతు బంధు పథకం నుండి తొలిగించే అవకాశాలు ఉన్నాయి.
★ కౌలు రైతులకు సాయంపై మార్గదర్శకాల రూపకల్పన
కౌలు రైతులకు కూడా రైతు భరోసా చెల్లిస్తామని తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో సుమారుగా 21 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వీరిలో అర్హులెందరు? అనర్హులెందరు? ఎంపిక ఎలా చేస్తారు? కౌలుదారుడికి ఇస్తే యజమానికి రైతు భరోసా నిలిపివేస్తారా? లేకపోతే ఇద్దరికీ ఇస్తారా? అనే అంశాలపై స్పష్టత లేదు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందిస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. కొన్ని రోజుల్లోనే దీనిపైై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.
- నూతన కేంద్రీయ మరియు నవోదయ విద్యాలయాలు ఏర్పాటు
- GK BITS IN TELUGU 7th DECEMBER
- చరిత్రలో ఈరోజు డిసెంబర్ 07
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- CURRENT AFFAIRS 4th DECEMBER 2024