సీజేఎల్స్ సర్టిఫికెట్ లను స.హ. చట్టం కింద అడిగిన కార్యకర్త బిక్షూ నాయక్

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల యొక్క డిగ్రీ మరియు పీజీ మెమోల జిరాక్స్ కాపీలను కోరుతూ బిక్షపతి నాయక్(బిక్షూ నాయక్) అనే సమాచార హక్కు చట్ట కార్యకర్త ఇఃటర్ విద్యా ఆర్జేడీ – వరంగల్ ఆఫీస్ లో దరఖాస్తు చేసుకున్నారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు చాలామంది యూజీసీ గుర్తింపు లేని యూనివర్సిటీలలో ఫీజీలను పూర్తిచేసుకుని మరియు దొంగ సర్టిఫికెట్ లతో వ్యవస్థలోకి ప్రవేశించారని.., అక్రమంగా ప్రవేశించి సరైన సర్టిఫికెట్ లు లేకుండా వేలకు వేలు జీతాలు తీసుకుంటూ విద్యార్థులకు, ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థకు అన్యాయం చేస్తున్నారని ఇలాంటి వారిని గుర్తించి ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థకు మేలు చేయడమే లక్ష్యంగా సమాచార హక్కు చట్టాన్ని ప్రయోగించాని ఈ సందర్భంగా బిక్ష్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.

దీని ద్వారా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ కు మేలు జరుగుతుందని.., కాంట్రాక్టు జూనియర్ అద్యాపకులను క్రమబద్ధీకరించే విషయం కూడా నిజమైన అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా బిక్షూ నాయక్ తెలిపారు.

సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రొ పార్మా కింద ఇవ్వబడినది

PROFORMA XL FILE