RRB NTPC JOBS – డిగ్రీతో 8,113 ఉద్యోగాలకు నోటిఫికేషన్

BIKKI NEWS (SEP. 23) : RRB NTPC 8113 GRDUATE JOB NOTIFICATION. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎన్టీపీసీ 8113 గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

RRB NTPC 8113 GRDUATE JOB NOTIFICATION

ఖాళీల వివరాలు :

గ్రాడ్యుయేట్ పోస్టుల (8,113) వివరాలు

1) చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ – 1736
2) గూడ్స్ ట్రైన్ మేనేజర్ – 3144
3) స్టేషన్ మాస్టర్ – 994
4) జూనియర్ ఎకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ – 1507
5) సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ – 732

అర్హత : ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాదించి ఉండాలి.

దరఖాస్తు గడువు : అక్టోబర్ 20 – 2024 వరకు

దరఖాస్తు ఫీజు : 500/- (SC, ST, EBC, EXSM, మైనారిటీ, ట్రాన్స్‌జెండర్స్, దివ్యాంగులు, మహిళలకు 250/-)

వయోపరిమితి : జనవరి 01 – 2025 నాటికి 18 – 36 సంవత్సరాల మద్య ఉండాలి.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా మాత్రమే

ఎంపిక విధానం : అన్ని పోస్టులకూ రెండు దశల్లో నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ టెస్టు (సీబీటీ)లో ప్రావీణ్యం తప్పనిసరి. స్టేషన్ మాస్టర్ పోస్టుకు కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్టు (సీబీఏటీ) అదనంగా రాయాలి. టైపిస్ట్ పోస్టులకు టైపింగ్ స్కిల్ టెస్టు (టీఎన్టీ) నిర్వహిస్తారు. ఆ తర్వాత ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహించి ఉద్యోగంలోకి తీసుకుంటారు.

వెబ్సైట్ : https://www.rrbapply.gov.in/#/auth/landing

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు