Home > JOBS > RRC > RRB ALP JOBS – 5696 అసిస్టెంట్ లోకో పైలెట్ ఉద్యోగాలు

RRB ALP JOBS – 5696 అసిస్టెంట్ లోకో పైలెట్ ఉద్యోగాలు

BIKKI NEWS (JAN. 18) : దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ లు 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ (రైలు డ్రైవర్) ఉద్యోగాల కోసం (RRB ALP NOTIFICATION 2024) నోటిఫికేషన్లు జారీ చేశాయి.

జనవరి 20 నుండి ఫిబ్రవరి 19 వరకు ఆన్లైన్ ద్వారా అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

సికింద్రాబాద్, అహ్మదాబాద్, భువనేశ్వర్, ముంబై, గువాహటి, రాంచి, గోరఖ్‌పూర్, మిర్జా పూర్, అజ్మీర్, బిలాస్‌పూర్, మజఫరాపూర్, బెంగళూరు, చండీగఢ్, కోల్‌కతా‌, పాట్నా, సిలిగురి, ముంబై, చెన్నై, మాల్దా, ప్రయాగ్రాజ్ , తిరువనంతపురం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నాయి.

ఈ నోటిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి సంబంధిత RRB వెబ్సైట్ ను సందర్శించాలి.

పోస్ట్ వివరాలు : అసిస్టెంట్ లోకో పైలట్ (రైలు డ్రైవర్) ఉద్యోగాలు

పోస్టుల సంఖ్య : 5,696

దరఖాస్తు విధానం : ఆన్లైన్ పద్దతిలో

దరఖాస్తు గడువు : ఫిబ్రవరి – 19 -2024

అర్హతలు : పదోతరగతి మరియు సంబంధించిన విభాగంలో ఐటీఐ చేయాలి.

వయోపరిమితి : 18 – 30 సంవత్సరాల మద్య ఉండాలి.

వేతనం : 19,900/- నుంచి

దరఖాస్తు ఫీజు : 500/- (SC, ST, EBC, మహిళలు, ట్రాన్స్‌జెండర్స్, మైనారిటీ లకు 250/- )

వేతనం : 19,970/-

పూర్తి నోటిఫికేషన్ : download pdd

దరఖాస్తు లింక్ – APPLY HERE