ఇంటర్ విద్యా నూతన ఆర్జేడిని కలిసిన అతిథి అధ్యాపకులు

ఇంటర్మీడియట్ విద్యా ఆర్జేడి గా శ్రీమతి జయప్రద భాయి పూర్తిస్థాయి బాధ్యతలను ఈరోజు వరంగల్ లోని ఆర్జెడి కార్యాలయంలో స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా అతిథి అధ్యాపకుల సంఘం నాయకులు జయప్రద భాయిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అతిధి అధ్యాపకుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిక్ష్ నాయక్, వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్, రవీంద్ర నాయక్‌, జూల లక్ష్మణ్, దేవేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us@