అమ్మ కోసం ఇంటర్విద్యా వరంగల్ ఆర్జేడీ ఆఫీస్ హైదరాబాద్ కా.? – మధుసూదన్ రెడ్డి.

తెలంగాణ ఇంటర్ విద్య ప్రాంతీయ కార్యాలయం వరంగల్ కేంద్రంగా పనిచేస్తుంది. రాష్ట్రంలోని హైదరాబాద్ మినహా 32 జిల్లాలు కళాశాలల పర్యవేక్షణ సిబ్బంది సర్వీస్ వివరాలు ఈ కార్యాలయం ద్వారానే కొనసాగుతున్నాయి. దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న 6వ జోన్ అధ్యాపకులు హైదరాబాద్ కేంద్రంగా 6వ జోన్ కార్యాలయాన్ని గాని లేదా ప్రస్తుతం హైదరాబాద్ సిటీ అధ్యాపకుల సర్వీసు నిబంధనలు చూస్తున్నా హైదరాబాద్ సిటీ ఆర్జేడి పరిధిలోకి 6వ జోన్ అధ్యాపకుల యొక్క సర్వీస్ వ్యవహారాలను తేవాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ డాక్టర్. పి. మధుసూదన్ రెడ్డి తెలిపారు.

కానీ దీనికి విరుద్ధంగా 5వ జోన్ మరియు 6వ జోన్ ప్రాంతీయ సంచాలకుల కార్యాలయాన్ని హైదరాబాద్ కు మార్చేందుకు ఇంటర్ విద్యాశాఖలోని అధికారులు తెరవెనక ప్రయత్నాలు చేస్తున్నారని ఉత్తర, దక్షిణ తెలంగాణా అధ్యాపకుల మధ్య చిచ్చు పెట్టె కుట్రలు చేస్తున్నారని ప్రభుత్వం ఈ విషయంలో అప్రమత్తంగా వుండాలని మధుసూదన్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో కేవలం 6వ జోన్ కార్యాలయాన్ని మాత్రమే హైదరాబాద్ కు తరలించాలని అధికారుల ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం ఆర్జేడీ కార్యాలయాన్ని హైదరాబాద్ కు తరలిస్తే ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ అధ్యాపకులు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం అవుతారని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ డాక్టర్. పి. మధుసూదన్ రెడ్డి హెచ్చరించారు.

Follow Us @