పల్లాని గెలిపించుకుంటాం – ఆర్జేడీ సంఘ (508) వరంగల్, ఖమ్మం, నల్గొండ అధ్యక్ష, కార్యదర్శులు

తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్ ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్రంలో లోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ లందరూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంట్రాక్టు అధ్యాపకుల గొంతుక అయినా పల్లా రాజేశ్వర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించుకునే బాధ్యత ప్రతి కాంట్రాక్టు అధ్యాపకుడిది.

ఈ రోజు ప్రతి కాంట్రాక్ట్ లెక్చరర్స్ బేసిక్ పే వేతనంగా తీసుకుంటున్నారు అంటే వివిధ ప్రభుత్వ పెద్దలతో పాటు పళ్ళా రాజేశ్వర్ రెడ్డి చూపించిన చొరవ అందరికి తెలిసిందే.

బేసిక్ పే వేతనంతో పాటు ఒక్క రోజు గ్యాప్ లేకుండా12 నెలల సర్వీస్ పొందుటలో కూడా పల్లా కృషి జగమెరిగిన సత్యం.

కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల మానసిక, శారీరక, ఆర్ధిక ఇబ్బందులకు కారణం అయినా బదిలీలు ఏ అధికారి గాని మంత్రి గాని పట్టించుకునే స్థితిలో లేక బదిలీ బాధితులు రోదన ఆరణ్య రోదన గా మారిన సమయంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో కలిసి పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వయనా ముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకువెళ్లి సీఎంవో కార్యాలయం నుండి బదిలీ ల ప్రకటన రప్పించిన విషయం విధితమే…

అలాగే భవిష్యత్తులో మనకు నెలనెలా వేతనం, సీఎల్స్ ఉద్యోగ భద్రతా, క్రమబద్దీకరణ వంటి విషయాలలో మన తరపుప చట్ట సభలలో ప్రశ్నించే గొంతుకె కాదు, పరిష్కారించే గొంతుక కావాలి.

కావునా కాంట్రాక్టు అధ్యాపకుల ప్రతి సమస్యను పరిష్కరించే సత్తా కేవలం పళ్ళా రాజేశ్వర్ రెడ్డికి మాత్రమే ఉంది. సీఎం కేసీఆర్ కు నమ్మిన వ్యక్తి, మన సమస్యలు తెలిసిన వ్యక్తి పళ్ళా. గడ్డి ఒక దానికి వేసి పాలు ఇంకోక చోట పితికితే ఫలితం ఉంటుందా… కావునా ప్రతి కాంట్రాక్టు అధ్యాపకుడు మొదటి ప్రాధాన్యత వేసి గెలిపించుకోవాలి. అని వరంగల్,ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు యుగేందర్ ,సతీష్,గంగరాజు, ప్రభాకర్, రాజు, శ్రీనివాస్, సతీష్ రెడ్డి మరియు ఇతర జిల్లాల నాయకులు.

Follow Us@