కాంట్రాక్టు అధ్యాపకుల గొంతుక పల్లాకే సంపూర్ణ మద్దతు – ఆర్జేడీ సంఘం

తెలంగాణ రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడిన పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించి చట్టసభలకు కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలను వినిపించే గొంతుకను పంపించడానికి కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులు పళ్ళాకు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించ వలసినదిగా కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల ఆర్జేడీ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రచారం గాదె వెంకన్న, కుమార్ లు నిర్వహించడం జరిగింది

కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకులకు బేసిక్ పే, 12 నెల వేతనం, ఒక్కరోజు గ్యాప్ లేకుండా 12 నెల సర్వీస్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి, అందించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ని తప్పక గెలిపించ వలసినదిగా ఈ సందర్భంగా గాదె వెంకన్న, కుమార్ లు కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకులకు పిలుపునిచ్చారు.

అలాగే వేలాది మంది గత 13 సంవత్సరాలుగా బదిలీలు లేక పడుతున్న బాధలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి సానుకూల ప్రకటన చేపించిన పళ్ళా సేవలు మరువలేనివని, అలాగే నెలనెలా వేతనం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేపించే బాధ్యత తీసుకున్న నేత పల్లా అని గాదె వెంకన్న తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం తరపున మన సమస్యలను పరిష్కరించే నాయకులుమలో ప్రథమ స్థానం పల్లా రాజేశ్వర్ రెడ్డి కి దక్కుతుందని కావున పల్లా గెలిపించుకోవడం మనందరి బాధ్యత అని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

పల్లా గెలుపు కోసం నిర్వహిస్తున్న ఈ సమావేశాలలో పాలోన్నవారు గాదె వెనకన్న, కుమార్, రాజు, యుగేందర్, సతీష్ తదితరులు.

Follow Us@