టీఆరెస్ అభ్యర్థి వాణీదేవికి మా మద్దతు – ఆర్జేడీ సంఘము ఉపాధ్యక్షులు ఆర్.సి. రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో పని చేస్తున్న కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ ల ప్రయోజనాల కోసం అందరూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో హైదరాబాద్ మహాబూబ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి పీవీ తనయ సురభి వాణీ దేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించుకునే బాధ్యత ప్రతి కాంట్రాక్టు అధ్యాపకుడిదని ఆర్జేడీ యూనియన్ ఉపాధ్యక్షుడు ఆర్సీ రెడ్డి పిలుపునిచ్చారు.

ఈ రోజు ప్రతి కాంట్రాక్ట్ లెక్చరర్స్ బేసిక్ పే వేతనం ఒక్క రోజు గ్యాప్ లేకుండా తీసుకుంటునంటే ముఖ్యమంత్రి కేసీఆర్ చూపించిన చొరవే అని అందరికి తెలిసిందే.

అలాగే భవిష్యత్తులో మనకు బదిలీలు…. నెలనెలా వేతనం, సీఎల్స్, ఉద్యోగ భద్రతా, క్రమబద్దీకరణ వంటి విషయాలలో మన తరపుప చట్ట సభలలో ప్రశ్నించే గొంతుకె కాదు, పరిష్కారించే గొంతుక కావాలంటే సురభి వాణి దేవి ని ఎమ్మెల్సీ గా గెలిపించుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మూడు ఉమ్మడి జిల్లాల ఆద్యక్షకార్యదర్శులు ఆంజనేయులు, తిరుపతి, ముని, చంద్రమౌళి, వెంకటస్వామి, రవీందర్ మరియు రాష్ట్ర నాయకులు చంద్రశేకర్, రామాంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు….

Follow Us@