కాంట్రాక్టు అధ్యాపకులకు నేనున్నా – ఆర్జేడీ సంఘ నేతలతో పల్లా

వరంగల్ – నల్గొండ – పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండవసారి అఖండ విజయం సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఈరోజు ఆర్జేడీ కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల సంఘం నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు.

ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గాదె వెంకన్న మాట్లాడుతూ కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల పలు సమస్యలను ముఖ్యంగా బదిలీల అంశాన్ని దృష్టికి తీసుకువెళ్లగా జూనియర్ సానుకూలంగా స్పందించారు.

ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకులకు నేనున్నానని ఏ సమస్య వచ్చినా నా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హమీ ఇచ్చారు.

తన విజయానికి సహకరించిన కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకులకు ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే సీఎం కేసీఆర్ కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా పీఆర్సీ ప్రకటించడం చాలా గొప్ప నిర్ణయమని తెలియజేశారు.

అలాగే కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకులు అన్ని సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని, మీరు ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో గాదె వెంకన్న, కుమార్, శ్రీపతి సురేష్ బాబు, ఆంజనేయులు, తిరుపతి, రామ్మోహన్, అనిల్ రెడ్డి, రవి, వరప్రసాద్, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow Us@