డెహ్రాడూన్ మిలటరీ కళాశాలలో 8వ తరగతి అడ్మిషన్లు – TSPSC

హైదరాబాద్ (ఆగస్టు 12) : కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్ లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (RIMC ADMISSIONS 2024 BY TSPSC) లో జులై 2024 టర్మ్ కు సంబంధించిన 8వ తరగతి అడ్మిషన్ల కోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ జారీ చేసింది.

★ వివరాలు :

RIMC 8th Class Admissions 2024 July Term

అర్హతలు : గుర్తింపు పొందిన పాఠశాలలో జూలై 2024 నాటికి ఏడవ తరగతి ఉత్తేదిత సాధించి ఉండాలి.

వయోపరిమితి : 02 – 07 – 2011 నుంచి 01 – 01 – 2023 మద్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు గడువు : అక్టోబర్ 15 – 2023

ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష, వైవా వోస్, మెడికల్ పరీక్షలు ఆధారంగా

పరీక్ష విధానం : రాత పరీక్షలో మూడు పేపర్లు ఉంటాయి. అవి… మ్యాథమెటిక్స్ (200), జనరల్ నాలెడ్జ్ (75) ఇంగ్లీష్ (125)… రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు వైవా వోస్ పరీక్ష.(50) ఉంటుంది. ఈ రెండిటిలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మెడికల్ పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు : 600/- (SC, ST – 555/-)

దరఖాస్తు విధానం : ఆన్లైన్ లో దరఖాస్తు ఫారం నింపి… ప్రింట్ అవుట్ తీసి నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో అందజేయాలి.

పరీక్ష తేదీ : డిసెంబర్ – 2 – 2023

వెబ్సైట్ : https://websitenew.tspsc.gov.in/public/rimc