RIMC ADMISSIONS: మిలటరీ కళాశాలలో 8వ తరగతి అడ్మిషన్లు

విజయవాడ (ఆగస్ట్ – 05) : డేహ్రాడూన్ (ఉత్తరాఖండ్)లోని రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కళాశాలలో (RIMC 8th class Admissions 2024) వచ్చే విద్యా సంవత్సరానికి గాను 8వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు APPSC తెలిపింది. గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఏడో తరగతి చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని వెల్లడించింది.

విద్యార్థులు 2011 జూలై – 02 నుండి 2013 జూలై – 01 మద్య జన్మించి ఉండాలి.

గణితం‌, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ సబ్జెక్టులలో రాత పరీక్ష ఉంటుంది.

దరఖాస్తు ఫీజు 600/- , SC, ST లకు 555/- గా ఉంది.

దరఖాస్తు చేయడానికి తుది గడువు అక్టోబరు 15గా నిర్ణయించింది.

రాష్ట్రంలో ఎంపిక చేసిన నగరాల్లో రాత పరీక్ష డిసెంబరు 2, 2023 జరగనుంది.

వెబ్సైట్ : https://psc.ap.gov.in/(S(r3saw0xjb4oszw2v33r1cnhj))/Default.aspx