ప్రపంచ నూతన కుబేరుడు బేర్నార్డ్ ఆర్నో

హైదరాబాద్ (డిసెంబర్ – 18) : ప్రపంచ కుబేరుల (RICHEST MAN) జాబితాలో అగ్రస్థానం వారం వారం మారుతుంది. తాజాగా మరో నూతన కుబేరుడు అగ్రస్థానాన్ని ఆక్రమించాడని బ్లూమ్‌బర్గ్ సంస్థ ప్రకటించింది. అతనే LVMH గ్రూప్ చైర్మన్ బెర్నార్డ్ ఆర్నో …

LVMH గ్రూప్ లో బ్రాండెడ్ బ్యాగులు, సెంట్లు వంటి ఆమ్మే 70 రకాల కంపెనీలు ఉన్నాయి.

1) బెర్నార్డ్ ఆర్నో (LVMH గ్రూప్) : 171 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచాడు.

2) ఎలన్ మస్క్ (టెస్లా కంపెనీ) : 164 బిలయన్ డాలర్ల సంపదతో రెండో స్థానంలో నిలిచాడు. ఎలక్ర్టిక్ కార్లు, స్పెస్ ఎక్స్, ట్విట్టర్ ల వంటి సంస్థల అధినేత.

3) గౌతమ్ అదాని (అదాని గ్రూప్ ) :125 బిలయన్ డాలర్ల సంపదతో మూడో స్థానంలో నిలిచాడు. భారతదేశానికి చెందిన వివిధ రంగాలలో కంపెనీలు గల బడా వ్యాపారవేత్త.

4) జెఫ్ బెజోస్ (అమెజాన్ సంస్థ) : 111 బిలయన్ డాలర్ల సంపదతో నాలుగో స్థానంలో నిలిచాడు. అమెజాన్, ప్రైమ్ ఈ కామర్స్, ఓటీటీ వంటి సంస్థల అధిపతి.

5) బిల్ గేట్స్ (మైక్రోసాఫ్ట్ సంస్థ) : 104 బిలయన్ డాలర్ల సంపదతో ఐదో స్థానంలో నిలిచాడు. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సాఫ్ట్‌వేర్ సంస్థల అధిపతి.