IIIT BASARA ADMISSIONS : నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్ (జూన్ – 01) : RGUKT – BASARA ADMISSIONS NOTIFICATION – 2023 ను యూనివర్సిటీ వైస్ చాన్సలర్ వి. వెంకటరమణ విడుదల చేశారు. పదవ తరగతి పాసైన విద్యార్థుల కోసం ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ (ఇంటర్+బీటెక్) సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1650 సీట్లను పదవ తరగతిలో సాదించిన మార్కుల ఆధారంగా భర్తీ చేయనున్నారు. ళవర్సిటీలో 1500 సీట్లు ఉండగా, 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా కింద మరో 150 అదనంగా భర్తీ చేయనున్నారు.

◆ పూర్తి షెడ్యూల్ :

జూన్ 1: నోటిఫికేషన్ జారీ

జూన్ 5-19: ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువు

జూన్ 24: ప్రత్యేక కేటగిరీ (పీహెచ్/క్యాప్/ఎన్సీసీ/క్రీడాకారులు) వారు ఆన్లైన్ దరఖాస్తు ప్రింట్ ఔట్ సమర్పించేందుకు తుది గడువు

జూన్ 26: ఎంపికైన విద్యార్థుల జాబితా వెల్లడి

జులై 1: తొలి విడత కౌన్సెలింగ్ (ధ్రువపత్రాల పరిశీలన)

◆ ముఖ్యాంశాలు

మొత్తం సీట్లలో 85 శాతం రాష్ట్ర విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లకు రాష్ట్రంతోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడతారు.

ఈ సంవత్సరం పదో తరగతి పాసైన వారు మాత్రమే ప్రవేశాలకు అర్హులు. ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల వయసు 21 సంవత్సరాలు, మిగిలిన వారి వయసు 18 ఏళ్ల లోపు ఉండాలి.

దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.450/-, ఇతరులకు రూ.500/-

ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారి పదో తరగతి గ్రేడ్ కు 0.40 స్కోర్ కలుపుతారు.

ఒకవేళ ఇద్దరు విద్యార్థుల స్కోర్ సమానంగా ఉంటే ఏడు కొలమానాలను పరిగణనలోకి తీసుకుంటారు. మొదట గణితంలో, తర్వాత సైన్స్, ఆంగ్లం, సాంఘికశాస్త్రం, ప్రథమ భాషలో గ్రేడు పరిశీలించి సీట్లు ఇస్తారు. అవీ సమానంగా ఉంటే పుట్టిన తేదీ ఆధారంగా ఎక్కువ వయసు ఉన్న వారికి సీటు కేటాయిస్తారు. అది కూడా సమానంగా ఉంటే హాల్ టికెట్ ర్యాండమ్ నంబరు విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.

◆ వెబ్సైట్ : https://www.rgukt.ac.in/