తెలంగాణ రాష్ట్రానికి చెందిన బాసర(నిర్మల్)లోని ఆర్జీయూకేటీ లో తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు :: గెస్ట్ ఫ్యాకల్టీ, గెస్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, గెస్ట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్
1) గెస్ట్ ఫ్యాకల్టీ :: 59 పోస్టులు
ఇంజినీరింగ్ విభాగాలు :: సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్.
అర్హతలు :: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్/ తత్సమాన ఉత్తీర్ణత.
సైన్సెస్ అండ్ హ్యూమానిటీస్ విభాగాలు :: కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్, మేనేజ్మెంట్, తెలుగు.
అర్హత :: కనీసం 55% మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, మేనేజ్మెంట్ అభ్యర్థులకు ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు నెట్/ స్లెట్/ సెట్/ పీహెచ్డీ అర్హత, అనుభవం ఉండాలి.
వేతనం :: నెలకు రూ.30,000 చెల్లిస్తారు.
2) గెస్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ :: 15 పోస్టులు
విభాగాలు :: కెమికల్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఈఈఈ, మెకానికల్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇంగ్లిష్.
అర్హత :: విభాగాన్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీఎస్సీ, బీఈ/ బీటెక్, ఎంఏ/ బీఏ/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వేతనం :: నెలకు రూ.15000 చెల్లిస్తారు.
3) గెస్ట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ :: 17 పోస్టులు
విభాగాలు :: కెమికల్, ఈసీఈ, ఈఈఈ, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్(టర్నర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్), కెమిస్ట్రీ, ఫిజిక్స్.
అర్హత :: సంబంధించిన సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా(ఇంజినీరింగ్), బీఎస్సీ ఉత్తీర్ణత.
వేతనం :: నెలకు రూ.12,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం :: గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదా రాత పరీక్ష/ ఇంటర్వ్యూ, గెస్ట్ ల్యాబ్ అసిస్టెంట్, గెస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ లేదా రాత పరీక్ష/ ట్రేడ్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు పద్ధతి :: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 01.02.2021.
సైన్స్ అండ్ హ్యూమానిటీస్ గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది :: 04.02.2021.
గెస్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, గెస్ట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది :: 08.02.2021.
వెబ్సైట్ :: https://www.rgukt.ac.in/
నోటిఫికేషన్ :: https://drive.google.com/file/d/1h6znmW3F02rZwPDBe-jC7e9vNqhVOghV/view?usp=drivesdk
Follow Us@