రివైజ్డ్ ఆన్లైన్ తరగతుల గైడ్ లైన్స్

కోవిడ్ -19 కారణంగా ఈ విద్యా సంవత్సరం నాలుగు నెలలు జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు ల తరగతులను కోల్పోయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, UGC మరియు CBSE లు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సూచనతో మరియు ఇంటర్మీడియట్ బోర్డు సెప్టెంబర్ మొదటి తేదీ నుంచి ఆన్లైన్ తరగతులను ప్రారంభించిన విషయం తెలిసిందే….

అయితే కోవిడ్19 కారణంగా కళాశాలలోకి కేవలం 50 శాతం సిబ్బంది ని మాత్రమే అనుమతిస్తున్న నేపథ్యంలో…

ఈ 50 శాతం కళాశాలకు రాని జూనియర్ అధ్యాపకులకు అది సెలవు దినం కాదని, కోవిడ్19 కారణంగా భౌతిక దూరం పాటించడానికి మాత్రమే 50 శాతం సిబ్బందిని కళాశాలకు అనతిస్తున్నామని‌, కావునా ఇంటి వద్ద నుండి విద్యార్థులకు ఆన్లైన్, జూమ్ మరియు ఇతర పద్దతుల ద్వారా సందేహలు నివృత్తి చేయాలని పేర్కొన్నారు.

సంబంధిత జిల్లా విద్యాధికారులు 15 రోజులకోకసారి ఈ డేటాను క్రోడీకరించి ఆర్జేడీ ఆపీస్ లో సమర్పించాలని తెలిపారు.

Follow Us@