Home > EDUCATION > INTERMEDIATE > ఇంటర్మీడియట్ ఫలితాలపై రాష్ట్రస్థాయి సమీక్షా సమావేశం.

ఇంటర్మీడియట్ ఫలితాలపై రాష్ట్రస్థాయి సమీక్షా సమావేశం.

BIKKI NEWS (MAY 09) : Review meeting on inter results 2025 in inter board. హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మరియు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) కార్యదర్శి శ్రీ కృష్ణ ఆదిత్య, ఐఏఎస్, అధ్యక్షతన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు – 2025 ఫలితాల విశ్లేషణపై రాష్ట్రస్థాయి సమీక్షా సమావేశం జరిగింది.

Review meeting on inter results 2025 in inter board

ఈ సందర్భంగా వివిధ జిల్లాల ఇంటర్మీడియట్ విద్యాధికారులు (D.I.E.Os), జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు, చీఫ్ కోడింగ్ అధికారులు, స్ట్రాంగ్ రూమ్ నిర్వహణ బాధ్యతలు నిర్వహించిన అధికారుల సేవలను అభినందించారు.

ఈ సమావేశంలో రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల పెరుగుదల, విద్యార్థులకు మెరుగైన సదుపాయాల కల్పనపై ప్రధానంగా చర్చ జరిగింది.

జిల్లా స్థాయిలో ఇటీవల కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశాల వివరాలు, ఫలితాల విశ్లేషణ, అడ్మిషన్ల ప్రణాళిక, విద్యార్థులకు బస్ సౌకర్యం, హాస్టల్ వసతి, కళాశాలల అఫిలియేషన్ ప్రక్రియ, విద్యార్థుల హాజరు పెంపుదలపై చర్చించడం జరిగింది.

అకడమిక్ మాడ్యూల్ మరియు విద్యార్థుల బయోమెట్రిక్ అటెండెనస్ ను సమర్థవంతంగా అమలు చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీలతో వర్క్ షాప్ నిర్వహించబడింది. కమిటీ సభ్యుల నుండి అమలయోగ్యమైన సూచనలు తీసుకోబడ్డాయి.

రాబోయే విద్యా సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి మరియు గుణాత్మక విద్యా బోధనకు అవసరమైన అన్ని వసతులను కళాశాలలకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అధికారులకు తెలిపారు. ఈ దిశగా అధ్యాపకులు నిబద్ధతతో పని చేసి లక్ష్యసాధనలో భాగస్వాములు కావాలని కోరారు.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు