పదవ తరగతి పరీక్షలు, మన ఊరు – మన బడి కార్యక్రమం పై సబితా ఇంద్రారెడ్డి సమీక్ష

పదవ తరగతి పరీక్షలు, మన ఊరు-మన బడి పనుల పై విద్యాశాఖ అధికారులు, వివిధ శాఖల ఇంజనీర్లతో మంత్రి సబిత ప్రత్యేక సమావేశం నిర్వహించి, మాట్లాడారు. ఈ విద్యా సంవత్స రంలో కరోనా కారణంగా పలు ఇబ్బందులు ఏర్పడ్డా యని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించా ల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి మెరుగైన ఫలితాలు సాధించే దిశలో జిల్లా విద్యాధికారులు చర్యలు తీసు కోవాలని సూచించారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం.. తల్లిదండ్రుల ఆశయాలను, ఆకాంక్షలను సాకారం చేసే నిర్ణయంగా భావించాలని ఆమె సూచించారు.


రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థుల ఉత్తీర్ణత 100 శాతం సాధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధి కారులకు సూచించారు. ఇందుకోసం జిల్లాల వారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది పదో తరగతిలో 70 శాతం సిలబస్ ను ఖరారు చేశామని, ఈ మేరకే పరీక్ష నిర్వహిస్తున్నామని, పరీక్షల్లో చాయిస్ ప్రశ్నలను పెంచుతున్నా మని చెప్పారు. ‘మన ఊరు-మన బడి’ పథకంలో భాగంగా చేపట్టే పనుల్లో నాణ్యత ఉండేలా చూడాలని, ఈ విషయంలో రాజీ పడొద్దని
స్పష్టం చేశారు.

Follow Us @