BIKKI NEWS (SEP. 30) : Retirement ceremony of venkata swamy. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ధర్మకంచ, జనగామ నందు అకౌంటింగ్ అండ్ టాక్సేషన్ కోర్సు నందు ల్యాబ్ అటెండెంట్ గా గత 32 సంవత్సరాల నుండి కళాశాలలో పనిచేస్తున్న గుజ్జు వెంకటస్వామి ఉద్యోగ విరమణ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ నాముని పావని కుమారి, కళాశాల అధ్యాపక బృందం మరియు భోధనేతర సిబ్బంది సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పావని కుమారి మాట్లాడుతూ… ఇదే కళాశాలలో చదివి, ఇదే కళాశాలలో పనిచేసి రిటైర్డ్ కావడం చాలా సంతోషకరమైన విషయం అని అలాంటి అవకాశం ఎవరికీ రాదని అన్నారు. కళాశాలలో విద్యార్థులకు ఎప్పటికీ అందుబాటులో ఉండి వారి బాగోగులను చూసిన వెంకటస్వామి రిటైర్డ్ కావడం బాధాకరమైన విషయం అని మరియు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి సమయనుకూలంగా ఉద్యోగ విరమణ పొందడం అనేది సాధారణ విషయం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, అధ్యపాకేతర బృందం మరియు జనగాం జిల్లా ఇంటర్మీడియట్ విద్య శాఖ సిబ్బంది మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.