కాంట్రాక్టు లెక్చరర్ లకు రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు

హన్మకొండ (సెప్టెంబర్ – 29) : కాకాతీయ యూనివర్సిటీ ఈసీ మీటింగ్ లో కాంట్రాక్ట్ అధ్యాపకులు యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను 3.5 లక్షల నుంచి ఐదు లక్షల పెంచినందుకు కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ గారికి‌, రిజిస్టర్ గారికి, పాలక మండలి సభ్యులకు కాకతీయ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ కుమార్ లోధ్ తెలిపారు.

రాష్ట్రంలో ఏ యూనివర్సిటీలో లేని విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్ ను కాకతీయ యూనివర్సిటీలోని కాంట్రాక్టు లెక్చరర్ లకు కల్పించినందుకు శ్రీధర్ కుమార్ లోధ్ ధన్యవాదాలు తెలిపారు.