మార్చి 30 నుండి వయోపరిమితి పెంపు నిర్ణయం అమలు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని 61 ఏళ్ల పెంచుతు ఆర్థిక శాఖ స్టేట్ గెజిట్ నోటిఫికేషన్ ను జారీ చేసింది. మార్చి – 30 – 2021 నుండి అమలవుతుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుండి 61 ఏళ్లకు పెంచుతూ తీసుకువచ్చిన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఇటీవలే ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం మార్చి – 30 – 2021 నుండి అమలవుతుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

పరిపాలనలో అనుభవం గడించిన ఉద్యోగుల సేవలను వినియోగించుకునేందుకు గాను వారి పదవీ విరమణ వయస్సును 61కి పెంచుతూ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

ప్రభుత్వ నిర్ణయంతో 36 వేల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఉద్యోగుల వయస్సు పెరిగే కొద్ది వారి అనుభవం పెరుగుతుందని, ఆ అనుభవాన్ని ప్రభుత్వం మరింత వినియోగించుకునేలా వారి పదవీ విరమణ వయస్సు పెంచుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

Follow Us @