OBC లకు 27%, EWS లకు 10% రిజర్వేషన్లు – మోదీ

ఆలిండియా కోటా స్కీమ్ కింద‌ మెడిక‌ల్‌, డెంట‌ల్ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో OBC లకు 27 శాతం, ఆర్థికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు ( EWS ) 10 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తున్నట్లు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ గురువారం ప్ర‌క‌టించారు.

ఈ రిజ‌ర్వేష‌న్లు ప్ర‌స్తుత విద్యా సంవత్స‌రం నుంచే MBBS, MD, MS, BDS, MDS, DIPLOMA మెడిక‌ల్ కోర్సులకు వ‌ర్తిస్తాయి.

ఈ నిర్ణ‌యం ఎంబీబీఎస్‌లోని 1500 మంది ఓబీసీలు, 550 ఈడ‌బ్యూఎస్ విద్యార్థుల‌కు.. పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ చేస్తున్న 2500 మంది ఓబీసీలు, 1000 మంది ఈడ‌బ్ల్యూఎస్ విద్యార్థుల‌కు మేలు చేయ‌నుంద‌ని ఆరోగ్య శాఖ చెప్పింది. దేశ‌వ్యాప్తంగా ఉన్న ఓబీసీలు ఇక నుంచి ఈ ఆలిండియా కోటా స్కీమ్ కింద ఉన్న ఈ రిజ‌ర్వేష‌న్ల‌పై ఏ రాష్ట్రంలో అయినా సీట్ల కోసం పోటీ ప‌డ‌వ‌చ్చ‌ని తెలిపింది.

Follow Us @