DSC – నేటి నుంచి డీఎస్సీ ధ్రువపత్రాల పరిశీలన – కావాల్సిన సర్టిఫికెట్ లు ఇవే

BIKKI NEWS (OCT. 01) : Required documents for DSC certificate verification. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ డీఎస్సీ జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ (జీఆర్‌ఎల్‌) ను విడుదల చేసింది. ఆయా జిల్లాల్లో 1:3 నిష్పత్తిలో ఎంపికైన వారికి అక్టోబర్ 1 నుంచి 5వ తేదీ వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు కావాల్సిన దృవపత్రాలు.

Required documents for DSC certificate verification

జిల్లాలు.. రోస్టర్‌ పాయింట్ల ఆధారంగా 1:3 నిష్పత్తిలో అర్హులైన అభ్యర్థులకు ఎస్‌ఎంఎస్, ఈ-మెయిల్‌ ద్వారా సమాచారం అందిస్తామని తెలిపారు.

1:3 మెరిట్ జాబితాలు అన్ని జిల్లాల డీఈఓ వెబ్‌సైట్లలోనూ అందుబాటులో ఉంచనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

అవసరమైన దృవపత్రాలు

విద్యార్హత ధ్రువపత్రాలు
టెట్ సర్టిఫికెట్
డీఎస్సీ హల్ టికెట్ మరియుదరఖాస్తు ఫారం
కుల ధృవీకరణ పత్రం
1-7 తరగతుల స్టడీ సర్టిఫికెట్‌ (ఒరిజినల్‌)లతో పాటు రెండు సెట్ల జిరాక్స్‌ పత్రాలను వెంట తీసుకురావాలని సూచించారు.

పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్ లో ఉంచిన ఫారాన్ని నింపి సర్టిఫికెట్ లతో పాటు తీసుకుని వెళ్ళాలి.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు