వరంగల్ (ఆగస్టు – 25) : యూనివర్సిటీలలో పనిచేస్తున్న 1335 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని కాకతీయ విశ్వవిద్యాలయం సౌదర్శించిన తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ ను కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగిందని శ్రీధర్ కుమార్ లోధ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుత తెలంగాణా విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ మరియు గవర్నర్ అయినా డాక్టర్ తమిళసై సౌందరరాజన్ ని తెలంగాణా ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలిసి పదకొండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు 1335 మందిని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి వినతిపత్రం ఇవ్వటం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీధర్ కుమార్ లోధ్, ఆర్డీ ప్రసాద్, డాక్టర్ అనిల్, డాక్టర్ కృష్ణ, డాక్టర్ బ్రహ్మం, డాక్టర్ మధుకర్ రావు, డాక్టర్ భాగ్యలక్ష్మి, డాక్టర్ కవిత, మధుశ్రీ, డాక్టర్ సుచరిత, డాక్టర్ ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు.