ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టాలి –

  • విద్యార్థుల అడ్మిషన్లు పెరగడానికి తగిన చర్యలు తీసుకోవాలి.
  • గౌరవ ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మాత్యులు ఏ రేవంత్ రెడ్డి గారికి TGJLA_475 ASSN వినతి పత్రం

BIKKI NEWS (APR. 07) : Requesting for Mid day meal programme for intermediate students. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు 2025-2026 విద్యా సంవత్సరం ప్రారంభ రోజు మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టాలని మరియు విద్యార్థుల అడ్మిషన్లు పెరగటానికి తగు సూచనలతో వినతి పత్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, విద్యాశాఖ మాత్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఈరోజు ఆన్లైన్ ద్వారా వినతిపత్రం పంపించినట్లు తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ -475 రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు శ్రీ డాక్టర్ వసుకుల శ్రీనివాస్, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో సుమారు 436 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నాయని, వీటిలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం జనరల్ మరియు ఒకేషనల్ కోర్సులలో సుమారు ఒక లక్ష 50 వేల మంది గ్రామీణ ప్రాంతంలోని పేద విద్యార్థులకు అందుబాటులో ఉండి వారు ఉన్నత విద్య చదవడానికి చాలా ఉపయోగపడుతుంది అని తెలుపుతూ, ఇంకా ఇవి అభివృద్ధి చెందటానికి 2025- 2026 విద్యా సంవత్సరంలో విద్యార్థుల అడ్మిషన్లు పెరగటానికి , తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ సూచన మరియు విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టాలని తెలిపారు.

అలాగే ప్రభుత్వ కళాశాలలో చేరిన విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్ ప్రతినెల అందేటట్లు చూడాలని, తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన ఇంటర్ విద్యను పరివేక్షించడానికి 26 కొత్త DIEO పోస్టులను సాంక్షన్ చేసి భర్తీ చేయాలని, నూతనంగా వివిధ జిల్లాల్లో నెలకొల్పిన 25 ప్రభుత్వ జూనియర్ కళాశాలకు టీచింగ్ ,నాన్ -టీచింగ్ పోస్ట్ శాంక్షన్ చేసి భర్తీ చేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చరిత్ర మరియు రాజనీతి శాస్త్రం బోధించడానికి జీవో నెంబర్ 302 ప్రకారం వేరువేరుగా అధ్యాపకులు నియమించాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ కోర్సులు బోధించడానికి ఇద్దరు లెక్చరర్ నియమించాలని, మారుతున్న పరిస్థితులు కు అనుగుణంగా విద్యార్థుల కోరిక మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల కోర్సులు ప్రవేశపెట్టాలి. ఉదాహరణకు ఆర్ట్స్ విభాగంలో(H.C.E.C) చరిత్ర రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం, కామర్స్, కాంబినేషన్తో కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాల మారుతున్న సబ్జెక్టు సిలబస్ ను పరిశీలించిన అధ్యాపకులు కు ఓరింటేషన్ తరగతులు నిర్వహించాలని తదితర సూచనలతో… గౌరవ ముఖ్యమంత్రివర్యులు& విద్యాశాఖ మాత్యులు ఏ రేవంత్ రెడ్డి గారికి మరియు తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ శ్రీ ఆకునూరు మురళి ఐఏఎస్ గారికి, తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గారికి, తెలంగాణ ఇంటర్ విద్య డైరెక్టర్& బోర్డు సెక్రటరీ శ్రీకృష్ణ ఆదిత్య గారికి ఈరోజు ఆన్లైన్లో వినతి పత్రం పంపించినట్లు తెలుపారు.
ప్రభుత్వ వీటిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నట్లు విజ్ఞప్తి చేశారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు