Home > UNCATEGORY > ప్రభుత్వ కళాశాలలకు దిన పత్రికలు & పోటీ పరీక్ష పత్రికలు పంపిణీ కై వినతి

ప్రభుత్వ కళాశాలలకు దిన పత్రికలు & పోటీ పరీక్ష పత్రికలు పంపిణీ కై వినతి

  • రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారికి TGJLA-475 వినతి

BIKKI NEWS (AUG. 05) : Requesting for daily and competitive exams papers supply to GJCs. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ తరఫున ఉచితంగా దిన పత్రికలు మరియు పోటీ పరీక్ష పత్రికలను పంపిణీ చేయవలసిందిగా తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ రియాజ్ గారికి విజ్ఞప్తి చేసినట్లు తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ – 475 రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు, డాక్టర్ వస్కుల శ్రీనివాస్ మరియు డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ తెలిపారు.

Requesting for daily and competitive exams papers supply to GJCs

ఈరోజు హైదరాబాదులో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ రియాజ్ గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగిందని, ఈ సందర్భంగా వారి ఆధ్వర్యంలో గ్రంథాలయాల అభివృద్ధి మరింత జరగాలని కోరుతూ, తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే బీద విద్యార్థినివిద్యార్థులకు పోటీ పరీక్షలు రాయటానికి వివిధ దిన పత్రికలు, పోటీ పరీక్షల పత్రికలను రాష్ట్ర గ్రంథాలయ సంస్థ తరఫున పంపిణీ చేయవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగిందని తెలిపారు.

ఈ సందర్భంగా డాక్టర్ రియాజ్ గారు సానుకూలంగా స్పందిస్తూ… త్వరలో ఈ విషయంపై సానుకూలమైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్, రాష్ట్ర జిల్లా నాయకులు పూర్ణ చందర్, గణపతి, హరగోపాల్, రాజిరెడ్డి, వెంకన్న, దుమ్ముగూడెం శ్రీనివాస్, భాస్కర్, ఇల్లందు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు