వడ్డీ రేట్లు యధాతథం – RBI

రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీల‌క వ‌డ్డీ రేట్ల‌ను రేట్ల‌ను వ‌రుస‌గా మూడో సమీక్ష లో కూడా య‌థావిధిగా కొన‌సాగిస్తునట్లు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్ వెల్ల‌డించారు. మానిట‌రీ పాల‌సీ క‌మిటీ దీనికి ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపింద‌ని ఆయ‌న తెలిపారు.

దీంతో రెపో రేటు 4 శాతంగానే కొన‌సాగుతోంది. రివ‌ర్స్ రెపో రేటు కూడా 3.35 శాతంగానే కొన‌సాగుతోంది. కొవిడ్‌-19 ప్ర‌భావాన్ని సాధ్య‌మైనంత వ‌ర‌కూ త‌గ్గిస్తూ.. ద్ర‌వ్యోల్బ‌ణాన్ని నియంత్ర‌ణ‌లో ఉంచ‌డ‌మే ల‌క్ష్యంగా మానిట‌రీ పాల‌సీ క‌మిటీ నిర్ణయాలు తీసుకుంటోంద‌ని శ‌క్తికాంత దాస్ చెప్పారు. రెపో రేటు అంటే వాణిజ్య బ్యాంకుల‌కు ఆర్బీఐ ఇచ్చే అప్పుపై విధించే వ‌డ్డీ రేటు.

Follow Us@